NTV Telugu Site icon

PRC: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని ఎదురుచూపులు…

Prc

Prc

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్సీ కమిషన్ గడువు ఏప్రిల్ 2, 2024న ముగియనుండగా, కమిషన్ ఛైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో కమిషన్ గడువును మరో 4 నుంచి 6 నెలల పాటు పొడిగించాలని సూచించారు.

READ MORE: CM Chandrababu: నేడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు.. హాజరుకానున్న సీఎం

గతంలో 2023 అక్టోబర్ 2న కమిషన్‌ను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆరు నెలల్లో నివేదికను సమర్పించాలని పేర్కొంది. అయితే పలు కారణాలతో ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించబడింది. తాజా అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

READ MORE: SRH-HCA: హెచ్‌సీఏ అధ్యక్షుడి బెదిరింపులు.. హైదరాబాద్‌ వీడిపోతామంటున్న ఎస్‌ఆర్‌హెచ్‌!

ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు గురించి అనేక సందేహాలు కొనసాగుతున్న తరుణంలో, కమిషన్ గడువు మరోసారి పెంచుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వేతన సవరణ కోసం నిరీక్షణలో ఉన్న ఉద్యోగులు, త్వరలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలని ఆశిస్తున్నారు.