NTV Telugu Site icon

Anagani Satya Prasad: “తాడేపల్లి, లోటస్ పాండ్ లోని జగన్ ఇళ్లలో ప్రభుత్వ ధనంతో ఫర్నీచర్”

New Project (12)

New Project (12)

జగన్.. తాడేపల్లి, లోటస్ పాండ్ ఇళ్లకు రూ.50 కోట్ల ప్రభుత్వ ధనంతో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
” సీఎం హోదాలో తాను తీసుకున్న ఫర్నిచరును జగన్ తిరిగి అప్పగించ లేదు. ఫర్నిచర్ అప్పగిస్తానని ప్రతిపక్ష నేత జగన్ ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. ప్రజలు జగన్ దొంగ బుద్ధి చూసి నేడు ఛీ కొడుతున్నారు. ప్రజల్లో ఈ అరాచకాలపై చర్చ జరగాలి. జగన్ కి ఏ మాత్రం నైతిక విలువలున్నా ప్రభుత్వ సొమ్ముతో తన ఇంట్లోకి కొనుగోలు చేసిన ఫర్నిచర్ని ప్రభుత్వానికి అప్పగించాలి. జగన్ ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్ సరెండర్ చేయకుండా వైసీపీ నేతలు నీతులు చెప్పడం సిగ్గుచేటు. చేయని తప్పుకు నాడు కోడెలను బలి తీసుకున్నారు. కోడెలపై అసత్య ఆరోపణలు చేసి ఆయన మరణానికి కారణమయ్యారు. కోడెలది ఆత్మహత్య కాదు వైసీపీ నేతలు చేసిన హత్య. ఫర్నిచర్ తీసుకెళ్లమని అప్పటి స్పీకరుకు రెండు సార్లు కోడెల లేఖలు రాసినా పట్టించుకోలేదు. తప్పుడు కేసులు పెట్టడం కక్ష సాధింపు చర్య కాదా..? ” అని పేర్కొన్నారు.

READ MORE: Delhi Fire Accident: ఢిల్లీ ముండ్కాలోని ఎల్‌ఈడీ లైట్ల ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..

ఈ రోజు ఆ భగవంతుడు కోడెల కుటుంబాన్ని కడిగిన ఆణిముత్యం లాగా జనాల్లో నిలిపారని ప్రకటనలో తెలిపారు. కాగా.. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు రెవెన్యూ శాఖ కేటాయించారు. ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. ఈ విజయం తమకు మరింత బాధ్యత పెంచిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి భారీ మెజార్టీతో గెలుపొందిన తనకు మంత్రిగా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.