NTV Telugu Site icon

Viral Video: దెబ్బ మాములుగా లేదు కదా.. అందుకే కొన్నింటికి దూరంగా ఉంటే మంచిది

Viral

Viral

సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమని జనాలు ఎంతటిదానికైనా తెగిస్తున్నారు. అది ప్రమాదకరమని తెలిసినా వదలట్లేదు. కొన్ని నవ్వు తెప్పించేటట్లు ఉంటే.. మరికొన్ని ప్రమాదకరంగా ఉంటాయి. కొందరైతే వీడియోలు చేసేందుకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా సోషల్ మీడియాలో హైలెట్ కావడం కోసం జనాలు ఏదైనా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వీడియోలో ఓ అమ్మాయి బుల్లెట్ బైక్ ను స్టార్ట్ చేయడం కోసమని కిక్ కొట్టింది. అది బెడసి ఆమేను కొట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత.. మీరు నవ్వును ఆపుకోవడం కష్టం.

Read Also: Virushka: పండగ పూట కూడా వామికను చూపించరా.. అన్యాయం ఇది..?

బుల్లెట్‌ని కిక్-స్టార్ట్ చేయడం ఎక్కువగా మగవాళ్లకు తెలుసు. కొన్నిసార్లు దీన్ని స్టార్ట్ చేసినప్పుడు అది తిరిగి రివర్స్ లో వస్తుంది. ఆ కిక్ ను కొట్టాలంటే బలంగా.. సరైన పద్ధతిలో చేయాలి. లేదంటే.. తిరిగి వచ్చి అది కాలుకు దెబ్బతీస్తుంది. అయితే అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ ను స్టార్ట్ చేయడానికి ఓ అమ్మాయి ప్రయత్నిస్తుంది. కిక్ కొట్టిన వెంటనే ఆమెకు తిరిగి వచ్చి కొడుతుంది. దీంతో నొప్పితో ఏడుస్తూ కూర్చుటుంది.

Read Also: Akkineni Nageswara Rao: ‘అన్నపూర్ణ’లో అక్కినేని నాగేశ్వర రావు పంచలోహ విగ్రహావిష్కరణ

@royal_.enfield అనే ఖాతా ద్వారా ఈ వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ‘ఇది స్కూటీ దీదీ కాదు..’ అని క్యాప్షన్‌లో రాశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 14 లక్షల మంది చూడగా.. 49 వేల లైక్‌లు వచ్చాయి. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆట అయిపోయిందా, దీదీ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఇది బుల్లెట్ దీదీ.. నెక్స్ట్ టైమ్ కిక్ జాగ్రత్తగా అని రాశారు. చాలా మంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలిపారు.