FUNKY Censored: U/A సర్టిఫికేట్‌తో రిలీజ్‌కు సిద్ధమైన ‘ఫంకీ’!

Funky

Funky

FUNKY Censored U/A: విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ (Funky) విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటుంది ఈ చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ లభించింది. కేవలం 128 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, ఆద్యంతం ‘అన్‌లిమిటెడ్ అబ్సర్డ్ ఫన్’ అందిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Pakistan Team: పరువంతా పోయిందిగా.. ఈ ఒక్క సంఘటన చాలు! పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే!

ఇకపోతే ఖమ్మం వేదికగా సందడి చేసేందుకు ‘మాస్ కా దాస్’ సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర బృందం, ఫిబ్రవరి 11న సాయంత్రం 4 గంటల నుండి ఖమ్మంలోని లేక్ వ్యూ క్లబ్‌లో అత్యంత వైభవంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. చిత్ర కథాంశం విషయానికి వస్తే.. ఇది సినిమా పరిశ్రమ నేపథ్యంతో సాగే సెటైరికల్ కామెడీ. ఇందులో విశ్వక్ సేన్ ఒక ఫిల్మ్ డైరెక్టర్‌గా విభిన్నమైన పాత్రలో కనిపించనుండగా, ఆయన సరసన కయాడు లోహర్ కథానాయికగా నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Deputy CM Pawan Kalyan: మరో ఇద్దరు అనాథ చిన్నారులకు పవన్‌ కల్యాణ్‌ ఆసరా.. తన జీతం నుంచి ప్రతి నెలా ఆర్థిక సాయం..

వాలెంటైన్స్ వీకెండ్ కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అనుదీప్ మార్క్ హ్యూమర్, విశ్వక్ సేన్ ఎనర్జీ తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. రెండు గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధమైన ‘ఫంకీ’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.