Site icon NTV Telugu

Fuel Tank Blast: సొరంగమార్గంలో పేలిన ఇంధన ట్యాంకర్.. 19 మంది దుర్మరణం

Fuel Tank Blast

Fuel Tank Blast

Fuel Tank Blast: ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న సొరంగమార్గంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో దాదాపు 19 మంది మరణించగా.. 32 మంది గాయపడినట్లు స్థానిక అధికారి ఆదివారం తెలిపారు. కాబూల్‌కు ఉత్తరాన 129 కిలోమీటర్లు (80 మైళ్లు) దూరంలో ఉన్న సలాంగ్ టన్నెల్‌లో ఈ ప్రమాదం జరిగింది. వాస్తవానికి సోవియట్ దండయాత్రకు సహాయం చేయడానికి ఈ సలాంగ్ టన్నెల్ 1960లలో నిర్మించబడింది. ఇది దేశంలోని ఉత్తర, దక్షిణాల మధ్య ఉన్న కీలక లింక్.

FIFA World Cup: వరల్డ్ కప్ స్టేడియం వద్ద కిమ్‌ జోంగ్‌ ఉన్‌!.. ఫొటోలు వైరల్

శనివారం రాత్రి సొరంగం పేలుడులో మహిళలు, పిల్లలు సహా కనీసం 19 మంది మరణించారని పర్వాన్ ప్రావిన్స్ అధికార ప్రతినిధి సెడ్ హిమతుల్లా షమీమ్ తెలిపారు. శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు కారణమేమిటనేది వెంటనే తెలియరాలేదు. ప్రస్తుతానికి మంటలు ఆరిపోయాయని, సొరంగాన్ని క్లియర్​ చేసేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని, మిగిలిన వారంతా తీవ్రంగా కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నారని వైద్య అధికారులు తెలిపారు. పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, మోల్వి హమీదుల్లా మిస్బా ఆదివారం మాట్లాడుతూ, మంటలను ఆర్పివేసినట్లు, సొరంగం క్లియర్ చేయడానికి బృందాలు ఇంకా పని చేస్తున్నాయని చెప్పారు.

Exit mobile version