Moda Kondamma Jatara 2024: మన్యం దేవతైన., గిరిజనుల కల్పవల్లి.. కోరికలు తీర్చే కొంగు బంగారం దేవతగా… ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవంగా.. పాడేరు మోదకొండమ్మ తల్లికి బాగా పేరుంది. ఇక నేటి నుండి అమ్మవారి మూడురోజుల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరగబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రెండవ గిరిజన జాతరగా పాడేరు మోదకొండమ్మ జాతరకు బాగా పేరొందింది. రాష్ట్ర విభజన తర్వాత మోదకొండమ్మ జాతర ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి గిరిజన జాతరగా గుర్తింపు పొందిన పాడేరు మోదకొండమ్మ ఉత్సవం నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం భక్తులు భారీగా తరలి వస్తారు. రాష్ట్రంలో జరిగే గిరిజనుల పెద్దపండుగ కావడంతో ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.
NTR Statue: చిత్తూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు..
నేటి నుండి పాడేరు మోదకొండమ్మ అమ్మవారి రాష్ట్ర గిరిజన జాతర మహోత్సవాలు మొదలై.. మూడురోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరగనున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల నుండి లక్షల్లో భక్తులు రానున్నారు. దింతో పాడేరు వ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు మోహరించారు. జాతర సందర్భంగా పాడేరులో పెద్ద ఎత్తున్న టీడీపీ స్వాగత ఫ్లెక్సీలు వెలిసాయి.
Kalki 2898 AD : ఎక్కడ చూసిన ‘కల్కి’ మయమే..ఈ సారి మరింత భారీగా..?