భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయదశమి ఇది అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరపున అండ గా ఉంటామని హామీ ఇస్తున్నామని, దసరా బహుమతిగా పామాయిల్ కర్మాగారం లో పవర్ ప్లాంట్ ప్రారంభించడం ఆనంద దాయకమన్నారు భట్టి విక్రమార్క. ప్రపంచం మొత్తం థర్మల్ పవర్ నుండి గ్రీన్ పవర్ వైపుగా అడుగులు వేస్తోందని, రాబోయే ఐదేళ్ళల్లో తెలంగాణా లో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు 1990 లో పామాయిల్ సాగు కోసం ఆలోచన చేశారని, మలేషియాకు ఇక్కడి బృందాలను పంపి పామాయిల్ తీసుకువచ్చే ఏర్పాట్లకు పునాది నాడే పడిందన్నారు భట్టి విక్రమార్క.
Harihara Veeramallu: హరిహర వీరమల్లు కోసం పాట పాడిన పవన్
దిగుమతి కి కస్టమ్స్ డ్యూటీ 28 % పెంచి మన పామాయిల్ కు మద్దతు ధర దిశగా చర్యలు తీసుకున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 73 వేల కోట్లు కేటాయించామన్నారు. రెండు లక్షల రుణ మాఫీ 18 వేల కోట్లు 15 రోజుల్లోనే వేసి చరిత్ర సృష్టించామని, గత బీఆర్‌ఎస్ పాలకులు అరకొర ఋణమాఫీలు చేసి చేతులు దులుపున్నారన్నారు. అంతేకాకుండా..’ఇప్పుడొచ్చి తగుదునమ్మా అని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఏ వెసులుబాటు వున్నా మిగిలిన రైతులకు కూడా మాఫీ చేస్తాం. భవిష్యత్ లో రైతులకు పంట భీమా ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది. రైతు గౌరవంగా నిలబడే ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పైలట్ ప్రాజెక్టు లు తీసుకుని పొలాల్లో సోలార్ పంప్ సెట్ లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ నిధులతో ఇళ్లపై కూడా సోలార్ పెట్టుకునేలా ఆలోచన చేస్తున్నాం. అశ్వారావుపేట ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ గా రెండు గ్రామాలను తీసుకుని సోలార్ ప్రాజెక్టు ప్రారంభిస్తాం. రైతులకు రుణమాఫీ లో సాంకేతిక కారణాలు ఏవున్నా సరిచేసి మాఫీ చేస్తాం’ అని భట్టి విక్రమార్క అన్నారు.
CM Chandrababu: గ్యాంగ్ రేప్ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు..