Site icon NTV Telugu

Nimmala Rama Naidu: ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు.. రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు!

Nimmala

Nimmala

ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు . నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత రాయలసీమ ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చిందో, మరల ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే స్థాయిలో ఆదరణ వచ్చిందన్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగు గంగ, జిఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, హెచ్ఎల్ సి ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించామన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకే అత్యధికంగా బడ్జెట్లో రూ.3240 కోట్లు సీఎం కేటాయించారని మంత్రి నిమ్మల చెప్పుకోచ్చాడు.

రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ… ‘అన్నమయ్య ప్రాజెక్టు తక్కువ నిర్మాణంతో రూపొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈలోపు వాస్తవ పరిస్థితిని అధికారులతో చర్చిస్తున్నాం. డ్యామ్ నిర్మాణం పూర్తి అయ్యేలోపు రైతుల సూచనల మేరకు లిఫ్ట్ ద్వారా కెనాల్స్ ద్వారా మీరు సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తాం. గత పాలకుల ఇసుక దోపిడీ, లూటీ వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. 41 మంది చనిపోతే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం పరామర్శించలేదు. అన్నమయ్య డ్యామ్ నిర్మాణానికి అంచనాలు రూపొందిస్తున్నాం’ అని అన్నారు.

‘నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత రాయలసీమ ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చిందో, మరల ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే స్థాయిలో ఆదరణ వచ్చింది. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగు గంగ, జిఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, హెచ్ఎల్సి ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించాం. ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకే అత్యధికంగా బడ్జెట్లో రూ.3240 కోట్లు కేటా్యుంచారు చంద్రబాబు. ఒంటిమిట్ట భూ కబ్జాదారులను కఠినంగా శిక్షిస్తాం’ అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు.

Exit mobile version