NTV Telugu Site icon

Kollywood: నిర్మాతలు vs నటులు.. ఆగస్టు 15 తర్వాత షూటింగులు బంద్.?

Kollywood

Kollywood

Kollywood Mews: ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే విధంగా కనబడే కోలీవుడ్ లో గత కొన్ని రోజుల నుంచి పరిస్థితులు వేరేలా నెలకొన్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో రెండు వర్గాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నడిగర సంఘం, నిర్మాతల మండలి సంఘం మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. ఇకపోతే నిర్మాతల మండలిలో నిర్మాతలు అందరూ కలిసి ఓ గ్రూప్ ఏర్పరచుకున్నారు. ఇక అదే నడిగర సంగం విషయానికి వస్తే.. అగ్ర నటీనటుల నుంచి చిన్నపాటి నటీనటుల వరకు ఉండే సభ్యులందరూ ఒక గ్రూప్.

Committee Kurrollu: మెగా ఫ్యామిలీ నుంచి నిహారికకు సపోర్ట్ అందట్లేదా..? అసలు విషయం అదేనా..?

ఇకపోతే కొద్ది రోజుల క్రితం కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో లలో ఒకరైన హీరో ధనుష్ పై నిర్మాతల మండలి కాస్త కఠినంగా నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ విషయం సంబంధించి ధనుష్ కి నోటీసులు పంపిన విషయం కూడా తెలిసిందే. హీరో ధనుష్ ప్రొడ్యూసర్ల నుంచి అడ్వాన్సులు తీసుకొని అవసరమైన సినిమా షూటింగ్ సమయంలో పాల్గొనకుండా నిర్మాతలకు టార్చర్ పెడుతున్నట్లు అందులో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇకపై తీసుకున్న అడ్వాన్సుగా న్యాయం చేసేలా ఆ సినిమా పూర్తయ్యే వరకు వేరే సినిమా షూటింగ్ లో పాల్గొనకూడదని హీరో ధనుష్ కు నిర్మాత మండలి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ విషయం ఇదివరకు హీరో విశాల్ కు కూడా జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న విషయంలో నడిగర సంఘం హీరో ధనుష్ కే మద్దతుగా నిలిచింది. ఆయన పై పెట్టిన ఆంక్షలు తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సంఘానికి సీనియర్ నటుడు నాజర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Viva Harsha Divorce: విడాకులు తీసుకున్న క‌మెడియ‌న్ హ‌ర్ష.. అసలు నిజం ఇదే..

పరిస్థితి ఇలా ఉండగా ఆగస్టు 15 నుండి నిరవధికంగా షూటింగులు ఆపివేస్తారని సమాచారం అందుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ప్రస్తుతం హీరోలు తీసుకున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాలని.. లేకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని సమాచారం అందుతుంది. ఈ విషయంలో కేవలం హీరోలు మాత్రమే కాదు.. ఏ నటీనటులు అయినా సరే వారికి వర్తిస్తుందని నిర్మాతలమాత్రం సంఘం తెలుపుతోంది.

Show comments