NTV Telugu Site icon

Fraud: పోలీసు అధికారినంటూ ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు కాజేత

Fraud

Fraud

ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్, దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్‌కతా పోలీసుల సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని చెప్పాడని తెలిపాడు. తనకు అనుమానాస్పదంగా పంపిన కొరియర్‌ను పరిశీలించగా.. అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పాడు. ఈ కేసుపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు బృందం త్వరలో కోల్‌కతాకు వచ్చి నిందితుడిని అరెస్టు చేయనుంది.

GST: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయింపు..

ఈ మోసాన్ని ఎలా చేస్తారనే విషయానికొస్తే.. నిందితులు డబ్బులు ఎక్కువగా ఉండే వ్యాపారిని టార్గెట్ చేసుకుని గుర్తిస్తారు. తాము పోలీసులమంటూ.. వారికి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపించి భయపెట్టిస్తారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతన్ని బెదిరిస్తారు. అంతేకాకుండా.. కొరియర్ లోనే నకిలీ అరెస్ట్ వారెంట్ పంపిస్తారు. ఆ తర్వాత కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇలా ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు ఇవ్వాలని అడిగారు. ఆ డబ్బులు చెల్లిస్తే తన అరెస్టును నివారించవచ్చని చెప్పారు. తనను రక్షించుకోవడానికి.. అతను చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేశాడు. కొద్దిరోజుల తర్వాత అతడి నుంచి మరింత డబ్బు డిమాండ్ చేయడంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించాడు.

Minister Seethakka : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

డబ్బు జమ చేసిన బ్యాంకు ఖాతా నుంచి 10 బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు సైబర్ సెల్ దర్యాప్తులో తేలింది. అదే బ్యాంకు ఖాతాల ఆధారంగా హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. దీని వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు సైబర్ సెల్ అనుమానిస్తోంది. అరెస్టయిన ఇద్దరిని విచారించి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.