NTV Telugu Site icon

France: దారుణం.. భార్యను 72 మందితో అత్యాచారం చేయించిన దుర్మార్గపు భర్త..

France

France

భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఉదంతం ఫ్రాన్స్ నుంచి వెలుగులోకి వచ్చింది. ఇది విన్న తర్వాత మీరు కూడా మానవ నాగరికత ఎటువైపు పయనిస్తుందో ఆలోచించవలసి వస్తుంది. సొంత వాళ్లపై కూడా నమ్మకాన్ని పోగొట్టే ఈ ఘటన ఫ్రాన్స్ లో చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యకు మత్తుమందు ఇచ్చి.. పలువురు అపరిచితులచే ఆమెపై అత్యాచారం చేయించాడు. దీనికి సబంధించిన కేసు ఫ్రాన్స్‌లో నడుస్తోంది. ఈ ఘటన ఫ్రాన్స్ ప్రజలను కూడా కలచివేసింది. ఈ ఘటనపై మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఈ 50 మంది దక్షిణ నగరమైన అవిగ్నాన్‌లో కూడా విచారణను ఎదుర్కొంటున్నారు. మరోవైపు బాధితురాలు ధైర్యంగా బయటికొచ్చి బహిరంగ విచారణ కోరుకుంటున్నారు.

READ MORE: Bengaluru: రూ.17లక్షల ఖరీదైన పట్టుచీరలు లూటీ.. చివరికిలా దొరికిపోయారు!

ప్రధాన నిందితుడు 71 ఏళ్ల వృద్ధుడు, అతను ఫ్రాన్స్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఈడీఎఫ్ మాజీ ఉద్యోగి. భార్య(72) పట్ల కొన్నేళ్ల పాటు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. రాత్రి సమయంలో ఆమె తినే ఆహారంలో డ్రగ్స్‌ కలిపేవాడు. ఆమె మత్తులోకి జారుకోగానే పలువురు అపరిచితులను ఇంటికి పిలిచేవాడు. ఆ వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే, రహస్య కెమెరాల్లో రికార్డు చేసేవాడు. పదేళ్లపాటు ఆ మహిళకు నరకం చూయించాడు. ఈ కేసులో 72 మంది పురుషులు చేసిన మొత్తం 92 అత్యాచారాలను పోలీసులు లెక్కించారు. అందులో 51 మందిని గుర్తించారు. 2011-2020 మధ్య ఈ దారుణాలు చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

READ MORE: Rain Alert to Andhra Pradesh: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఈ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!

వాస్తవానికి నిందితుడు సెప్టెంబరు 2020లో ఒక షాపింగ్ సెంటర్‌లో ముగ్గురు మహిళలతో అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు. మహిళల వీడియోలను రహస్యంగా తీస్తుండగా.. సెక్యూరిటీ గార్డు పట్టుబడ్డాడు. పోలీసులు ఈ కేసులో డొమినిక్ పిని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వ్యక్తి కంప్యూటర్‌లో అతని భార్య యొక్క వందలాది ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు లభించాయి. అవి ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తీసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. ఇంకా విచారణ కొనసాగుతోంది.

READ MORE: Anti-Rape Bill: ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లో ఉరి.. అత్యాచార నిరోధక బిల్లు పూర్తి వివరాలు

మహిళ తరఫు న్యాయవాది బాబోనో మాట్లాడుతూ.. “ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తనకు ఏమి జరిగిందనే విషయం ఆ మహిళకు తెలియదని.. దానిపై అవగాహన కల్పించాలని మహిళ కోరుకుంటోంది.” అని పేర్కొన్నారు.