Site icon NTV Telugu

French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!

French Open 2025 Final

French Open 2025 Final

French Open 2025 Final: ప్రపంచ టెన్నిస్‌లో నాలుగు ప్రధాన గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ లోని క్లే మట్టికోర్టులపై జరుగుతుంది. ఇది మట్టి పైనే ఆడే ఏకైక గ్రాండ్‌ స్లామ్ టోర్నీ కావడంతో ఆటగాళ్ల సహనాన్ని, ఫిట్‌నెస్‌ను పరీక్షించే గొప్ప వేదికగా నిలుస్తుంది. మట్టికోర్ట్‌ పై ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లే ఇక్కడ విజయాలు సాధించడం సహజం. అయితే, 2025 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌లో అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Read Also: Best Phone Under 20K: 20 వేల లోపు ధర.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌ (Novak Djokovic) కు ఈసారి కలవరమే ఎదురైంది. 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ సాధించి చరిత్ర సృష్టించిన జకోవిచ్, మరోసారి మట్టికోర్ట్ విజయం కోసం ప్రణాళికలు వేసుకున్నా, ఆ ఆశలపై ఇటలీ యువ సంచలనం జన్నిక్ సిన్నర్ (Jannik Sinner) నీళ్లు చల్లాడు. తాజాగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సిన్నర్ 5-7, 7-5, 7-5తో విజయం సాధించాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జన్నిక్ సిన్నర్ మొదటి సెట్‌ ను కోల్పోయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా బలమైన సర్వ్‌ లు, పదునైన ఏస్‌ లతో చెలరేగి వరుసగా రెండు సెట్లను గెలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. సెమీస్‌ స్టేజ్‌లో జకోవిచ్‌ను ఓడించిన రెండో ఇటాలియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ అనంతరం సిన్నర్ మాట్లాడుతూ.. జకోవిచ్ అత్యుత్తమ ఆటగాడు. అతడిని ఓడించాలంటే మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా ఉండాలి. ప్రతి పాయింట్‌కు నేను పోరాడాను. కౌంటర్ అటాక్ తప్పనిసరని.. అందుకు తగ్గట్టుగా నా బెస్ట్ గేమ్‌ను ఇచ్చానని తెలిపాడు.

Read Also: Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. ఆ జిల్లాలో కర్ఫ్యూ..

ఇక సెమీఫైనల్ సంచలన విజయం సాధించిన సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్‌లో అడుగుపెట్టాడు. అక్కడ అతడి డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ తో పోటీ పడనున్నాడు. వీరిద్దరి మధ్య తుది పోరు నేడు (జూన్ 8) న జరగనుంది.

Exit mobile version