French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
French Open 2025 Final: ప్రపంచ టెన్నిస్‌లో నాలుగు ప్రధాన గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని క్లే మట్టికోర్టులపై జరుగుతుంది. ఇది మట్టి పైనే ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నీ కావడంతో ఆటగాళ్ల సహనాన్ని, ఫిట్‌నెస్‌ను పరీక్షించే గొప్ప వేదికగా నిలుస్తుంది. మట్టికోర్ట్ పై ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లే ఇక్కడ విజయాలు సాధించడం సహజం. అయితే, 2025 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌లో అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Read Also: Best Phone Under 20K: 20 వేల లోపు ధర.. బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
Also Read
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) కు ఈసారి కలవరమే ఎదురైంది. 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి చరిత్ర సృష్టించిన జకోవిచ్, మరోసారి మట్టికోర్ట్ విజయం కోసం ప్రణాళికలు వేసుకున్నా, ఆ ఆశలపై ఇటలీ యువ సంచలనం జన్నిక్ సిన్నర్ (Jannik Sinner) నీళ్లు చల్లాడు. తాజాగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సిన్నర్ 5-7, 7-5, 7-5తో విజయం సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జన్నిక్ సిన్నర్ మొదటి సెట్ ను కోల్పోయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా బలమైన సర్వ్ లు, పదునైన ఏస్ లతో చెలరేగి వరుసగా రెండు సెట్లను గెలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. సెమీస్ స్టేజ్‌లో జకోవిచ్‌ను ఓడించిన రెండో ఇటాలియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాచ్ అనంతరం సిన్నర్ మాట్లాడుతూ.. జకోవిచ్ అత్యుత్తమ ఆటగాడు. అతడిని ఓడించాలంటే మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా ఉండాలి. ప్రతి పాయింట్‌కు నేను పోరాడాను. కౌంటర్ అటాక్ తప్పనిసరని.. అందుకు తగ్గట్టుగా నా బెస్ట్ గేమ్‌ను ఇచ్చానని తెలిపాడు.
Read Also: Manipur violence: మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. ఆ జిల్లాలో కర్ఫ్యూ..
ఇక సెమీఫైనల్ సంచలన విజయం సాధించిన సిన్నర్ ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్‌లో అడుగుపెట్టాడు. అక్కడ అతడి డిఫెండింగ్ చాంపియన్, స్పెయిన్ యువ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ తో పోటీ పడనున్నాడు. వీరిద్దరి మధ్య తుది పోరు నేడు (జూన్ 8) న జరగనుంది.
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..