Site icon NTV Telugu

RTC Bus: ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఇది తప్పనిసరి

Rtc Bus

Rtc Bus

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఈరోజు కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చించినట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. ముఖ్యంగా రెండు గ్యారంటీలపై ఈ భేటీలో చర్చించామని, ముందుగా వాటిని అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలో.. ఎల్లుండి (శనివారం) నుంచి మహిళా సోదరిమణులందరికీ ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం రూ.10 లక్షలకు పెంపు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కాగా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే తప్పనిసరి ఆధార్ కార్డ్ చూపించాలి. రాష్ట్రంలోని ప్రతి మహిళ రాష్ట్ర పరిధిలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు.

Exit mobile version