Free Smart Phone: స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు నథింగ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నథింగ్ సంస్థ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా ఈ బ్రాండ్ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా స్మార్ట్ ఫోన్ పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ట్విట్టర్‌లో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. అందులో కేవలం తాము చేసిన ట్వీట్‌కు కామెంట్ చేస్తే సరిపోతుందని నథింగ్ కంపెనీ తెలిపింది. మీరు చేసిన కామెంట్‌కు ఎవ్వరూ లైక్ కొట్టకపోతే మీకు నథింగ్ ఫోన్-1ను ఉచితంగా పొందే అవకాశం పొందవచ్చు. అలాగే ఎక్కువ లైక్స్ పొందిన కామెంట్‌కు కూడా ఉచితంగా స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అంటే ఇద్దరు విజేతలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్‌ను నథింగ్ సంస్థ అందించనుంది.
Read Also: Masooda: బెస్ట్ హారర్ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యింది…
కాగా నథింగ్ ఫోన్-1 మూడు వేరియంట్లలో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 27,499 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు వర్తిస్తుంది. అలాగే 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 30,499గా ఉంది. అదేవిధంగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. రూ.33,499గా ఉంది. ఈ ఫోన్లు అన్నీ ఆన్‌లైన్‌లో ఇప్పుడు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.