Site icon NTV Telugu

Free Bus Services: ఉచిత బస్సు ప్రయాణం.. హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు

Bus Free

Bus Free

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా మహిళలు ప్రయాణించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Read Also: RK Roja: తెలంగాణకు, ఆంధ్రాకు ఎటువంటి సంబంధం లేదు.. జగనన్నే వన్స్ మోర్‌..

ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో బాలికలు, మహిళలు.. టీఎస్‌ ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణించడానికి ఆసక్తిని చూపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్ సర్వీసులు ప్రారంభం తమకు వరమని అంటున్నారు. ఇది తమకు చెప్పలేని ఆనందం అని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పర్చుతున్నారని మహిళలు అంటున్నారు.

Read Also: France: మహ్మద్ ప్రవక్తని కించపరిచాడని ఫ్రెంచ్ టీచర్ శిరచ్ఛేదం.. దోషులుగా 6 టీనేజర్లు..

మరికొందరు మహిళలు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా తమకు ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. కాగా.. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళల రద్దీ పెరుగుతుందని, ఆ బస్సుల సంఖ్య కూడా తక్కువగా ఉండడంతో ప్రయాణించడం కష్టమేనని, బస్సులు పెంచి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మహిళలు కోరుతున్నారు.

 

Exit mobile version