NTV Telugu Site icon

Fraudster : ఏకంగా.. ఎంపీలు, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడు…

Cyber Fraud

Cyber Fraud

రోజురోజుకు కేటుగాళ్లు ముదిరిపోతున్నారు. ఏకంగా.. ఎంపీలు, ఎమ్మెల్యేలను బురిడీ కొట్టిస్తున్నాడో కేటుగాడు… ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ సెక్రటరీ గా పరిచయం చేసుకుంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫోన్ కాల్స్ చేయడం మొదలెట్టాడు. ప్రభుత్వం కొత్తగా లోన్ స్కీం తెస్తోందని.. 100 మంది సభ్యులకు లోన్లు అందించబోతోందని చెప్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. లోన్ మంజూరు కావాలంటే ఒక్కో వ్యక్తి కి 3600 చొప్పున 3 లక్షల 60 వేలు తాను చెప్పిన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పిన మోసగాడు.. డబ్బులు జమ కాగానే.. కాల్స్ కి స్పందించకుండా తప్పించుకుంటున్నాడు. ఓ ఎమ్మెల్యే ఫిర్యాదు తో ఈ కేటుగాడి బురిడీ బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ మోసాలకు పాల్పడుతుంది.. తోట బాలజీ అనే వ్యక్తి అని గుర్తించిన పోలీసులు.. మోసగాడు తోట బాలాజీ ను అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ నాయుడు, మల్లారెడ్డి, అనిల్ కుమార్ అంటూ.. ఒక్కో నేతకు ఒక్కో పేరు చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు కేటుగాడు.

మై నేత డాట్ కాం సైట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీ ల నెంబర్లను సేకరించి కాల్స్ చేస్తున్న బాలాజీకి… తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా 37 కేసులు నమోదయ్యాయి. 2008లో రామగుండం NTPC లో AE గా పనిచేసిన బాలాజీ.. లంచం తీసుకుంటుండగా పట్టుకున్నా సీబీఐ అధికారులు. విశాఖ సింహాద్రి ప్లాంట్ లోనూ పనిచేసిన బాలాజీ.. అక్కడా అక్రమాలకు పాల్పడటంతో ఉద్యోగంలో నుంచి తొలగించారు. కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులను బాలజీ మోసం చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే.. ఈ మేరకు పలు సెక్షన్ల కింద బాలాజీపై కేసు నమోదు చేశారు.