NTV Telugu Site icon

Padma Awards 2024: తైవాన్ పౌరుడికి పద్మభూషణ్ అవార్డు.. ఎందుకో తెలుసా..?

Young Lue

Young Lue

75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేషంగా సేవలందించిన మొత్తం 132 మందిని ఈ సంవత్సరం ఈ అవార్డుల కోసం ఎంపిక చేసింది. ఇందులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి, నటుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు మొత్తం ఐదుగురికి పద్మవిభూషణ్ ప్రకటించింది. 17 మందికి పద్మభూషణ్, మరో 110 మందికి పద్మ పురస్కారాలతో గౌరవించింది. ఇక వ్యాపార- పరిశ్రమ రంగానికి సంబంధించి నలుగురు పద్మ పురస్కారం అందుకోనున్నారు. వీరిలో యాంగ్ లీ (తైవాన్), సీతారామ్ జిందాల్ (కర్ణాటక) పద్మభూషణ్, కల్పనా మోర్పారియా (మహారాష్ట్ర), శశి సోనీ (కర్ణాటక) పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

Read Also: Gummanur Jayaram: మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ షాక్.. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య!

అయితే, 66 ఏళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO).. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లీ నాలుగు దశాబ్దాల కాలంలో మూడు కంపెనీలను స్థాపించారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో యంగ్‌ లీకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డు ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌లో సెమీ కండక్టర్ ప్రణాళికల కోసం సహకారం అందిస్తుంది. కరోనా తర్వాత చైనా నుంచి తమ పెట్టుబడుల్ని భారత్‌లో విస్తృతంగా పెట్టింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకల్లో తమ ప్లాంట్లను ఫాక్స్‌కాన్ సంస్థ ఏర్పాటు చేసింది. తమిళనాడులో ఏకంగా ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌కు అతిపెద్ద సరఫరాదారుగా ఫాక్స్‌కాన్ కొనసాగుతుంది. ఇక, 1986లో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ డిగ్రీ పూర్తి చేశారు. 1978లో తైవాన్ నేషనల్ చియావో తుంగ్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో బీఎస్ డిగ్రీని యాంగ్ లీ పూర్తి చేశారు.

Show comments