NTV Telugu Site icon

America: అమెరికాలో నలుగురు తెలుగు వాళ్ల అరెస్ట్.. మనుషుల అక్రమ రవాణా కేసు

Arrest

Arrest

మనుషుల అక్రమ రవాణా కేసులో అమెరికాలోని టెక్సాస్ పోలీసులు నలుగురు తెలుగు వాళ్లని అరెస్ట్ చేశారు. అందులో భార్యభర్తలు కూడా ఉన్నారు. ఆ దేశ చట్టాల ప్రకారం వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆ నలుగురూ- చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలెగా పోలీసులు నిర్ధారించారు. వారిలో సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా భార్యభర్తలు. టెక్సాస్‌లోని ప్రిన్స్‌టన్‌ కొలిన్ కంట్రీలో వాళ్లు నివసిస్తోన్నారు. మనుషుల అక్రమ రవాణాకు పాల్పడటం, నిర్బంధించి తమ కంపెనీల్లో వెట్టిచాకిరి చేయిస్తోన్నారంటూ ఫిర్యాదులు అందాయి. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కొలిన్ కంట్రీ గిన్స్‌బర్గ్ లేన్‌లోని ఓ ఇంట్లో 15 మంది మహిళలు ఒకే గదిలో నివసిస్తోన్నారని, వారి అత్యంత దయనీయంగా ఉందంటూ పెస్ట్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ప్రిన్స్‌టన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ 15 మంది బాధితుకు విముక్తి కల్పించారు.

READ MORE: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!

దీంతో పాటు ఆ ఇంట్లో కంప్యూటర్, కొన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువులు, బ్లాంకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ఫర్నిచర్ కూడా ఆ ఇంట్లో లేకపోవడం, ఆ ఇళ్లు కూడా అంతమంది నివసించడానికి అనుకూలంగా లేకపోవడం.. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు నిదర్శనంగా గుర్తించారు. వారిని చందన్ దశిరెడ్డి, సంతోష్ కట్కూరి, ద్వారకా గుండా, అనిల్ మలె బలవంతంగా నిర్బంధించినట్లు నిర్ధారించారు. కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలను ఇప్పిస్తామని ఆశపెట్టి వారిని అమెరికాకు తీసుకొచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అవన్నీ కూడా డొల్ల కంపెనీలేనని వెల్లడించారు. ప్రిన్స్‌టన్‌తో పాటు మెలిస్సా, మెక్‌కెన్నీ ప్రాంతాల్లోనూ ఈ దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.