NTV Telugu Site icon

Hyderabad: అలర్ట్.. అంబర్‌పేట్‌లో నలుగురు విద్యార్థులు అదృశ్యం…

అంబర్‌పేట్‌లో నలుగరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఎనిమిదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు19వ తేదీ నుంచి కన్పించకుండా పోయారు. అంబర్‌పేట్, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎండి అజమత్ అలీ(13), కొండ్‌పేట తేజ్‌నాథ్ రెడ్డి(13), నితీష్ చౌదరి(13), కోరే హర్ష వర్ధన్(13) నలుగురు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. స్కూల్ ఎగ్జామ్స్‌లో కాపీ కొడుతూ దొరికారు. టీచర్ వారిని మందలించింది.. పేరెంట్స్ కి విషయం చెప్పింది. పేరెంట్స్ కూడా మందలించడంతో నలుగురు కలిసి ఇళ్లలో నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలుర కుటుంబ సభ్యులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు కలిసి బుధవారం నుంచి కన్పించకుండా పోయారు. వెంటనే అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: Zelensky-Elon Musk: పిల్లలు చచ్చిపోతుంటే ఫొటోషూట్‌లా.. జెలెన్ స్కీ‌పై మస్క్ ఫైర్

READ MORE: Crime News: వివాహేతర సంబంధం బయటపడుతుందని.. పక్కింటావిడపై హత్యాయత్నం!