Site icon NTV Telugu

Students Drown in River: ఈతకు వెళ్లి కృష్ణానదిలో నలుగురు విద్యార్థుల గల్లంతు

Student Drown

Student Drown

Students Drown in River: కృష్ణా జిల్లాలోని యనమలకుదురులో విషాదం చోటుచేసుకుంది. విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న యనమలకుదురు వద్ద కృష్ణానదిలో నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు పడమటకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

Crime News: కూతురిపై కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చడంతో దారుణం.. చివరికి

వీరంతా కృష్ణానదిలో ఈతకు వెళ్లి గల్లంతైనట్లు స్థానికులు గుర్తించారు. విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కుటుంబాలు భయాందోళనకు గురవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version