Tragedy: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రలో భాగంగా సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో ఏలూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన నలుగురు గల్లంతయ్యారు. తొమ్మిది మంది ఈత కోసం సముద్రంలోకి వెళ్లగా.. నలుగురు గల్లంతు కాగా.. ముగ్గురి మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి. నాలుగో మృతదేహం కోసం మెరైన్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు దుగ్గిరాల జోసెఫ్ నగర్‌కు చెందిన కిషోర్(22), తేజా(21), నితిన్(22), అమూల్ రాజ్ (22)గా గుర్తించారు. నలుగురు యువకుల మృతితో వారి కుటుంబాలను విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. బీచ్‌కు వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Tragedy: సముద్ర తీరంలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు గల్లంతు
- బాపట్ల జిల్లా రామాపురం సముద్ర తీరంలో తీవ్ర విషాదం
- సముద్రంలో ఈతకు వెళ్లి నలుగురు గల్లంతు
- తీరానికి కొట్టుకు వచ్చిన మూడు మృతదేహాలు

Beach