రంగుల పండుగ రోజున వేర్వేరు ప్రమాదాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. రెండు చోట్ల జరిగిన బైక్ ప్రమాదాల్లో ముగ్గురు చనిపోతే, సరదాగా ఈతకెళ్లి మరో చిన్నారి మృతి చెందిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read Also: Revanth reddy: మనవడితో కలిసి హోలీ ఆడిన సీఎం రేవంత్
వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం దగ్గర ద్విచక్ర వాహనం చెట్టుకు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వెంకటాపూర్ మండలం తిమ్మాపూర్ కు చెందిన ఉమ్మడి ఉమేష్ (22), లక్ష్మీదేవిపేటకు చెందిన ఎంబడి శృశాంత్ (22) గా గుర్తించారు. ఇక భూపాలపల్లి జిల్లాలో జరిగిన బైక్ ప్రమాదంలో 30 ఏళ్ల యువకుడు చనిపోయాడు. గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో చిట్యాల మండలం జడలపేట గ్రామానికి చెందిన బొట్ల రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Also: Chandrababu: ఒకటో తేదీనే ఇంటి వద్దకే రూ. 4వేల పింఛన్..
అటు.. మహబూబాబాద్ జిల్లాలో హోలీ పండగ రోజు విషాదం చోటు చేసుకుంది. నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన అబ్బూరి రిత్విక్ రెడ్డి(10)అనే బాలుడు.. ప్రమాద వశాత్తూ చెరువులో పడి మృతిచెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా హోలీ పండగ పూట ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాలు జరిగాయి.