NTV Telugu Site icon

Fake Notes: దొంగ నోట్లు తయారు చేస్తున్న నలుగురు వ్యక్తుల ముఠా అరెస్ట్

Fake Currency

Fake Currency

Fake Notes: తిరుపతికి చెందిన దొంగ నోట్లు తయారీ ముఠాను పుత్తూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. డీఎస్పీ రవికుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు
తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లిలోని తులిప్ రెసిడెన్సీ వద్ద గల రమేష్ తన ఇంటిలోని భార్య సంధ్య (40) కూతురు నిషా (25) స్నేహితుడు మునికృష్ణారావు (32) లతో కలిసి దొంగ నోట్లు తయారు చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా దొంగ నోట్లు ఎలా తయారు చేసే విధానాన్ని నేర్చుకొని అందుకు తగిన పరికరాలను సమకూర్చుకున్నారు.

Read Also: Baba Siddique Murder: బాబా సిద్ధిక్ హత్యలో ప్రధాన షూటర్ అరెస్ట్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం..

మూడు నెలలు పాటు దొంగ నోట్లు తయారీని ప్రాక్టీస్ చేశారు. తర్వాత గత మూడు నెలల్లో రూ.500 నోట్లను సుమారు 10 లక్షల మేరకు తయారుచేశారు. వీటిని తిరుపతి శ్రీకాళహస్తి, నెల్లూరు, వెంకటగిరి, చిత్తూరులో చలామణి చేశారు. చివరగా పుత్తూరులో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 192 వంద రూపాయలు నోట్లు, 156 రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే నోట్లు తయారీకి అవసరమైన 29 రకాల పరికరాలతో పాటు వోక్స్ వాగన్ కారును స్వాధీనం చేసుకున్నారు, పుత్తూరులోని నిర్మల ప్రొవిజనల్ స్టోరీ యజమాని కె.కుప్పయ్య శెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన నలుగురిని పుత్తూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు పుత్తూరు డీఎస్పీ తెలిపారు.

Show comments