NTV Telugu Site icon

Accident: అదుపు తప్పిన లారీ.. మూడు ట్రక్కులు, రెండు కార్లు ధ్వంసం

Accident

Accident

ఓ లారీ అదుపుతప్పి ముందువెళ్తున్న వాహనాలను ఢీకొన్న ఘటనలో నాలుగురు మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా తోప్పూరు సమీపంలో నిన్న (బుధవారం) సాయంత్రం జరిగింది. ధర్మపురి – సేలం జాతీయ రహదారిలోని తోప్పురు కట్టమేడు క్రాస్‌ వంతెన రూట్ లో ధర్మపురి నుంచి సేలం వైపు వెళుతున్న ఓ లారీ వంతెనపై అదుపు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Read Also: Devara : సినిమాకే హైలెట్ గా నిలవనున్న ఆ కీలక ట్విస్ట్..?

కాగా, ముందు వెళ్తున్న రెండు కార్లు, మరో రెండు లారీలను ట్రక్కు ఢీ కొట్టింది. ఓ లారీ అదుపు తప్పి వంతెనపై నుంచి కింద పడిపోగా.. క్షణాల్లో వంతెనపై నుజ్జయిన వాహనాల్లో మంటలు వచ్చాయి. దీంతో ఆ పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నాలుగురు మరణించినట్టు పోలీసులు నిర్ధారించాగా.. మరో ఎనిమిది మందికి గాయాలు కావడంటి వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read Also: Adi srinivas: కేటీఆర్ కు దోరాహంకారం ఇంకా పోలేదు.. ఆది శ్రీనివాస్ ఫైర్‌

అయితే, వంతెనపై నుంచి పడ్డ లారీ కింది భాగంలో ఎవరైనా చిక్కుకుని ఉండవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. అలాగే, మంటల్లో మరెవరైనా ఆహుతి అయ్యారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన కారణంగా ధర్మపురి – సేలం మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్ట్ అయ్యాయి. ఈ విజువల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.