Site icon NTV Telugu

Boy Fell Into Pit Dug: పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం.. నాలుగున్నరేళ్ల బాలుడు మృతి

Boy Fell Into Pit Dug

Boy Fell Into Pit Dug

Boy Fell Into Pit Dug: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచినీటి కుళాయి కోసం తవ్విన గోతిలో పడి నాలుగున్నర ఏళ్లు బాలుడు శ్రీను మృతి చెందాడు. ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు అనంతలోకల్లా కలిసిపోవడంతో దివాన్ చెరువు గ్రామంలో విషాదం అలుముకుంది. విషయం తెలిసిన వెంటనే అర్ధరాత్రి. జిల్లా కలెక్టర్ ఘటన స్థలానికి చేరుకుని మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వపరంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మృతుని కుటుంబానికి న్యాయం చేసే వరకు దహన కార్యక్రమాలు నిర్వహించడానికి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

Read Also: Leopards in Balapur: హైదరాబాద్‌లో చిరుతల కలకలం.. బాలాపూర్‌లో రెండు చిరుతలు..

ఇక, కుటుంబ సభ్యులను పరామర్శించి ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ… లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.. నిర్లక్ష్యం వహించిన స్థానిక పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో శ్రీరాంపురం వెళ్లి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు జిల్లా కలెక్టర్ ప్రశాంతి.. కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాలో ఎక్కడ గుంటలు లేకుండా పూడ్చివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి..

Exit mobile version