NTV Telugu Site icon

ICC T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్‌ కోసం అమెరికాకు బయలుదేరిన టీమిండియా తొలి బ్యాచ్..

Teamindia

Teamindia

అమెరికాలో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ కోసం తొలి బ్యాచ్‌ భారత ఆటగాళ్లు అమెరికా కు బయలుదేరారు. అమెరికాకు బయలుదేరిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, శివమ్ దూబే, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పేస్ బౌలర్ హెడ్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఉన్నారు.న్యూయార్క్‌కు విమానం ఎక్కిన ఇతర ఆటగాళ్లు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ లు కూడా ఉన్నారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో కూడిన సహాయక సిబ్బంది కూడా అమెరికాకు బయలుదేరారు. ప్రస్తుత పదవీ కాలంలో కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి జాతీయ జట్టులో ఇదే చివరి టోర్నమెంట్ కాబోతుంది.

SRH vs KKR Final Match: మూడోసారి ఛాంపియన్ గా కోల్‌కతా నైట్ రైడర్స్ అవతరిస్తుందా.. ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధం..

జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్ గేమ్ ఆడనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఐర్లాండ్, పాకిస్తాన్, ఆతిథ్య యుఎస్ఏ, కెనడాతో పాటు పోటీలో గ్రూప్ దశలో ఉంది. జూన్ 5న న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో టీమిండియా మొదటి మ్యాచ్ ఆడనుంది.

Team India Headcoach: హెడ్ కోచ్ పదవిపై మనసులో మాటను బయటపెట్టిన ఏబిడి..

భారతదేశం పొట్టి ప్రపంచకప్‌ ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2013లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచిన చివరి ఐసీసీ ట్రోఫీ తర్వాత టీమిండియా ఇంతవరకు ఎలాంటి ఐసీసీ ట్రోఫీను గెలవలేక పోయింది.