NTV Telugu Site icon

M Venkaiah Naidu: ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు ఆనవాళ్లు ఉండవు

M Venkaiah Naidu

M Venkaiah Naidu

M Venkaiah Naidu: ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు ఆనవాళ్లు ఉండవు అని హెచ్చరించారు భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. కాకినాడలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సును ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొందరు భాష చాలా ఎబ్బెట్టుగా, వెటకారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వాలు దురదృవశాత్తు సాహిత్యాన్ని ప్రోత్సహించడం లేదన్నారు.. ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే.. తెలుగు భాష ఆనవాళ్లు కూడా ఉండవన్నారు. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చిందన్నారు. ఇక, 45 ఏళ్లు విరామం లేకుండా రాజకీయాలు చేశాను అని గుర్తుచేసుకున్నారు.. మాతృ భాష తల్లి లాంటిది.. తెలుగు శతకాలు అలవాటు చేస్తే పిల్లలు బాగుపడతారు అని సూచించారు భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు..

Read Also: BJP: ఏపీ అభ్యర్థుల ఎంపికలో బీజీపీ ట్విస్ట్‌..! వారికి మొండి చేయి..

కాగా, వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా 30వ వార్షికో త్సవం సందర్భంగా.. తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా కాకినాడలో ఈ రోజు, రేపు రెండు రోజులపాటు అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు.. కాకినాడ దంటు కళాక్షేత్రంలో జరుగుతోన్న ఈ సదస్సుకు ఈ రోజు ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరయ్యారు.. తెలుగు భాషలో వస్తున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు.