NTV Telugu Site icon

Pithapuram Ex MLA SVSN Varma: వైసీపీలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే..!? క్లారిటీ ఇచ్చిన వర్మ

Svsn Varma

Svsn Varma

Pithapuram Ex MLA SVSN Varma: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్‌ టాపిక్‌.. అక్కడ ఏం జరిగినా..? ఇది జరగబోతోంది..? అంటూ ప్రచారం జరిగినా.. వైరల్‌గా మారిపోతోంది.. ఇక, టీడీపీ సీనియర్‌ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ.. ప్రస్తుతం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ సమయంలో.. ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు అనే వార్త గుప్పుమంది.. రేపే మాపో.. ఆయన వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం సోషల్‌ మీడియాకు ఎక్కింది.. అయితే, దీనిపై స్పందించిన వర్మ.. అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు.. నేను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మనిషిని అని స్పష్టం చేశారు.. 2014 నుంచి నన్ను వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆయన.. మీ వల్ల అది జరగదు.. జరగని పని అని క్లారిటీ ఇచ్చారు. అయితే, పిఠాపురంలో ఓడిపోతామని తెలిసి.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇలాంటి అబద్ధపు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.. ఎన్నికల తర్వాత చంద్రబాబు- పవన్ కల్యాణ్‌ సమక్షంలో.. వైఎస్‌ జగనే మా పార్టీలో చేరుతారు అంటూ సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్‌ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ.

Read Also: Namburu Sankara Rao: మంచిని చూడండి.. మనసారా ఆశీర్వదించండి: నంబూరు శంకరరావు

కాగా, పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కేటాయించిన తర్వాత.. స్థానికంగా టీడీపీ శ్రేణులు, మాజీ ఎమ్మెల్యే వర్మ అభిమానులు కొందరు పలు చోట్ల ఆందోళనకు దిగిన విషయం విదితమే.. టీడీపీ జెండాలు, బోర్డులను కూడా వారు ధ్వంసం చేశారు.. దీంతో.. వర్మ ఇండిపెండింట్‌గా బరిలోకి దిగుతారనే ఓ ప్రచారం తెరపైకి వచ్చింది.. ఇదే సమయంలో.. టీడీపీకి గుడ్‌బై చెబుతారనే చర్చ కూడా సాగింది.. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడిన తర్వాత.. ఒక్కసారిగా సైలెంట్‌ అయిన వర్మ.. పవన్‌ కల్యాణ్‌తో పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఆయనకు పవన్‌ కల్యాణ్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు.. పిఠాపురంలో పోటీ చేస్తుంది పవన్‌ కల్యాణ్‌ మాత్రమే కాదు.. వర్మ కూడా అంటూ.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.