Site icon NTV Telugu

Dhammika Niroshana Dead: కుటుంబం ఎదుటే.. దారుణ హత్యకు గురైన మాజీ క్రికెటర్‌!

Dhammika Niroshana Shot Dead

Dhammika Niroshana Shot Dead

Former Sri Lanka Cricketer Dhammika Niroshana Shot Dead: శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన (41) దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే ఓ దుండగుడు అతడిని దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం (జూన్ 16) రాత్రి శ్రీలంకలోని అంబలంగోడలోని అతడి నివాసంలో జరిగింది. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ధమ్మిక మృతికి పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో ధమ్మిక నిరోషన కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ధమ్మికపై దాడి చేశాడు. భార్య, ఇద్దరు పిల్లల ముందే తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధమ్మిక నిరోషన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: Silver Rate Today: వెండి కూడా బంగారమైంది.. లక్ష రూపాయలు దాటేసింది!

2000 సంవత్సరంలో శ్రీలంక అండర్‌-19 జట్టుకు ధమ్మిక నిరోషన కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రీలంక జూనియర్ జట్టుకు వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆపై ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌ ఏ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల 20 ఏళ్లకే అతడు క్రికెట్‌ను వదిలేశాడు. శ్రీలంక సీనియర్ క్రికెట్ జట్టులో ఆడే అవకాశం అతనికి రాలేదు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ధమ్మిక.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 మ్యాచ్‌లు, లిస్ట్-ఏలో 8 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 19, 5 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకలోని చిలావ్ మారియన్స్ క్రికెట్ క్లబ్, గాలే క్రికెట్ క్లబ్ మరియు సింఘా స్పోర్ట్స్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వచించాడు.

Exit mobile version