Dhammika Niroshana Dead: కుటుంబం ఎదుటే.. దారుణ హత్యకు గురైన మాజీ క్రికెటర్!
- దారుణ హత్యకు గురైన మాజీ క్రికెటర్
- భార్యా పిల్లల ఎదుటే కాల్పులు
- నిందితుడి కోసం గాలింపు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Sri Lanka Cricketer Dhammika Niroshana Shot Dead: శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషన (41) దారుణ హత్యకు గురయ్యాడు. భార్యా పిల్లల ఎదుటే ఓ దుండగుడు అతడిని దారుణంగా కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం (జూన్ 16) రాత్రి శ్రీలంకలోని అంబలంగోడలోని అతడి నివాసంలో జరిగింది. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ధమ్మిక మృతికి పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో ధమ్మిక నిరోషన కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు. మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడి ధమ్మికపై దాడి చేశాడు. భార్య, ఇద్దరు పిల్లల ముందే తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధమ్మిక నిరోషన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
Also Read: Silver Rate Today: వెండి కూడా బంగారమైంది.. లక్ష రూపాయలు దాటేసింది!
2000 సంవత్సరంలో శ్రీలంక అండర్-19 జట్టుకు ధమ్మిక నిరోషన కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రీలంక జూనియర్ జట్టుకు వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఆపై ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల 20 ఏళ్లకే అతడు క్రికెట్‌ను వదిలేశాడు. శ్రీలంక సీనియర్ క్రికెట్ జట్టులో ఆడే అవకాశం అతనికి రాలేదు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన ధమ్మిక.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 మ్యాచ్‌లు, లిస్ట్-ఏలో 8 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 19, 5 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకలోని చిలావ్ మారియన్స్ క్రికెట్ క్లబ్, గాలే క్రికెట్ క్లబ్ మరియు సింఘా స్పోర్ట్స్ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వచించాడు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!