NTV Telugu Site icon

Pocharam Srinivasa Reddy: ముందున్నది ముసళ్ళ పండుగ.. మాజీ స్పీకర్ హాట్ కామెంట్స్

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నియోజవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల కృతజ్ఞత సభ, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వారు తరువాత ఎన్నికలలో ఓడిపోతారనే పుకారు ఉండేది.. గతంలో స్పీకర్లుగా పనిచేసిన వారు అందరూ ఓడిపోయారు.. కానీ బాన్సువాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో చరిత్ర తిరగరాసానని పోచారం తెలిపారు. తెలంగాణ శాసనసభలో అత్యంత ఎక్కువ వయస్సు సభ్యుడిని తానేనన్నారు. కేసీఆర్ తరువాత ఎక్కువ సార్లు విజయం సాధించిన శాసన సభ్యుడిన్ని తనేనని పేర్కొన్నారు.

Read Also: CM Revanth Reddy: ధరణి పోర్టల్ పై సీఎం కీలక ఆదేశాలు

ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇల్లు అలకగానే పండుగ కాదు.. రైతుబంధు రూ. 15,000 ఇస్తాం అన్నారు, మళ్ళీ తాము ఇచ్చిన రూ. 10,000 లే ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే రెండు లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు రెండు రూపాయల మాఫీ కూడా లేదని ఆరోపించారు. ముందున్నది ముసళ్ళ పండుగ.. శాసనసభలో మంచి పనులు చేస్తే సమర్ధిస్తాం, ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే నిలదీస్తామని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి.. మీకు అన్ని విధాలుగా మద్దతిస్తాం.. ప్రజలు, రైతులు బాగుపడటమే తమకు కావాలని మాజీ స్పీకర్ పోచారం అన్నారు.

Read Also: Video Viral: రైలులో మహిళతో కలిసి పోలీస్ అధికారి డ్యాన్స్.. వీడియో వైరల్