NTV Telugu Site icon

Graeme Smith: సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం ప్రత్యర్థులకు కష్టమే

Grame Smith

Grame Smith

2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. భారత్ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. ఎలాగైనా కప్ ను గెలుచుకోవాలన్న ఆశతో టీమిండియా ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ ప్రశంసలు కురిపించాడు.

Read Also: Kasani Gnaneshwar: టీడీపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్

సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడటంతో టీమిండియా బ్యాలెన్స్ దెబ్బతిందని.. అయినప్పటికీ ప్రపంచకప్‌లో ఏ ప్రత్యర్థి జట్టు నుంచి గట్టి పోటీని ఎదుర్కోలేదని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు భారీ విజయాలను నమోదు చేసింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది.

Read Also: Electoral Bonds Scheme: ఆ హక్కు ప్రజలకు లేదు.. రాజకీయ పార్టీల విరాళాలపై సుప్రీంకు కేంద్రం

ఇదిలా ఉంటే.. గ్రేమ్ స్మిత్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారత్ చాలా అద్భుతంగా ఆడుతుందని, ఇప్పటివరకు టోర్నమెంట్‌లో ఎటువంటి కఠినమైన పోటీని ఎదుర్కోలేదు. ఇంగ్లాండ్‌పై జట్టు 230 పరుగులు చేసిన తర్వాత, వారు కష్టాల్లో పడ్డట్లు అనిపించింది.. కానీ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విజయం సాధించారని తెలిపాడు. గత కొన్నేళ్లుగా స్వదేశంలో భారత్ ఒక జట్టుగా బలమైన ప్రత్యర్థిగా ఉందని స్మిత్ అన్నాడు. సొంత గడ్డపై భారత్‌ను ఓడించడం ఎప్పుడూ కష్టమే అని అన్నాడు.