Mudragada Padmanabham: మా కులంలోకి రావొద్దు.. రెడ్ల పరువు తీయొద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం పేరు మార్పు వ్యవహారాన్ని కొందరు రెడ్డీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి దీనిపై ఓ లేఖ విడుదల చేయడం హాట్ టాపిక్‌గా మారింది.. లేఖ విడుదల చేయడంతో పాటు.. ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు కర్రి వెంకట రామారెడ్డి… “ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగడ బలపర్చిన పార్టీ ఘోర పరాజయం పొందినందుకు రెడ్డి కులంలో కలవాలని గెజిట్ పబ్లికేషన్ కొరకు అన్నీ సిద్ధం చేసుకున్నట్టు ఓ ప్రకటన నాలుగు రోజుల క్రితం వెలవడింది.. అయితే, వారిని నేను కొన్ని వివరాలు కోరుతున్నాను.. అయ్యా పద్మాభం మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? మా రెడ్ల పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..
Read Also: Modi 3.0 Cabinet: కొత్త కేబినెట్‌కు శాఖలు కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలంటే..
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
మరోవైపు ఆంధ్రా రెడ్డి సంఘం సభ్యలకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు వెంకట రామారెడ్డి.. ముద్రగడ పద్మనాభం రెడ్లలో చేరాలని ప్రకటించి నాలుగు రోజులు అయినా మీరు ఎందుకు మాట్లాడటం లేదు ? అని నిలదీశారు. గౌరవంగా బ్రతికే రెడ్లు.. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే.. వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకు ఏంటి? అని మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘం సభ్యులుగా మీకు ఉంది.. ఇప్పటికైనా సంఘం సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవటం లేదని ప్రకటించాలని కోరారు.. ఏదైమైనా ముద్రగడ పద్మానభం రెడ్లలో చేరటాన్ని ఒక గ్రామ మాజీ సర్పించ్‌గా, రెడ్డిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు కర్రి వెంకట రామారెడ్డి..
Read Also: Kalki 2898 AD Trailer : గూజ్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి ట్రైలర్.. చూశారా?
కాగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. తాను చేసిన సవాల్‌కు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసిన విషయం విదితమే.. నా పేరును పద్మనాభరెడ్డి గా మార్చాలని గెజిట్‌కు దరఖాస్తు చేసుకుంటానని వెల్లడించారు. అయితే, ఎన్నికల సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. పిఠాపురంలో ఎలా గెలుస్తాడో తాను చూస్తానని సవాల్ చేసిన పద్మనాభం.. ఒకవేళ పవన్ గనుక పిఠాపురంలో గెలిస్తే.. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన సవాల్ చేసిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!