Site icon NTV Telugu

Datta Dalvi: మాజీ మేయర్ పై వీధి వ్యాపారి దాడి

Mayor

Mayor

Datta Dalvi: ముంబై మాజీ మేయర్ దత్తా దల్వీపై విక్రోలి ప్రాంతంలో దాడి జరిగింది. దాల్వీపై ఓ వీధి వ్యాపారి దాడి చేసినట్లు సమాచారం. కన్నంవర్ నగర్‌ లోని స్టేషన్‌ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాచారం ప్రకారం, దల్వీ శివసేన (యుబిటి) సీనియర్ నాయకుడు పదేళ్లుగా ఈ ప్రాంతానికి కార్పొరేటర్‌గా ఉన్నారు. 45 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డుపై వీధి వ్యాపారి రెండు కూరగాయల బండ్లను పెట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని దత్తా దళ్వీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వీధి వ్యాపారి మాజీ మేయర్ పై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు.

Eluru Hospital: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నం..

ఈ ఘటన తర్వాత వీధి వ్యాపారిపై దత్తా దల్వీ విక్రోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీధి వ్యాపారులు తరచూ రోడ్లపై అడ్డంకులు సృష్టిస్తున్నారని, దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముంబైలోని రోడ్లపై ఇలాంటి ఆక్రమణల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దాల్వీ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు మొత్తం కేసు దర్యాప్తు ప్రారంభించారు.వీధి వ్యాపారిని గుర్తించి అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

Car Crashed: బ్రేకింగ్‌కు బదులు యాక్సిలరేటర్‌ నొక్కాడు.. డైవింగ్ నేర్చుకుంటూ చెరువులోకి దూసుకెళ్లాడు..

Exit mobile version