Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేపటి నుండి రెండు రోజులపాటు పోలీస్ కస్టడీలో విచారణ జరగనుంది. మహిళ హత్యకేసులో నందిగం సురేష్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. రేపు ఉదయం 11:30 నుండి సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల వరకు కస్టడీలోకి తీసుకుని మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు విచారించనున్నారు.
Read Also: AP CM Chandrababu: ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కాగా, 2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు జరిగడంతో.. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయితే, ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా తుళ్లూరు పోలీసులు చేర్చారు.