NTV Telugu Site icon

Rapaka Vara Prasada Rao: త్వరలో వైసీపీకి రాజీనామా చేస్తా.. మాజీ ఎమ్మెల్యే రాపాక కీలక నిర్ణయం

Rapaka Varaprasad

Rapaka Varaprasad

Rapaka Vara Prasada Rao: త్వరలో వైసీపీ పార్టీని వీడబోతున్నానని రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తెలిపారు. ఇప్పటికే వైసీపీ పార్టీ పెద్దలకు ఈ విషయం తెలియజేశానని వెల్లడించారు. తాను జనసేన ఎమ్మెల్యేగా గతంలో ఉంటూ అనివార్య కారణాలవల్ల వైసీపీలో కొనసాగానని పేర్కొన్నారు. వైసీపీలో అధిష్టానం చెప్పిన పనులన్నీ చేశానని.. గడపగడపకి వైసీపీ ఎమ్మెల్యేలు చేయని విధంగా కూడా పూర్తి చేశానన్నారు. వేరే పార్టీలో చేరుతానని తాను ఎక్కడా ప్రకటించలేదన్నారు.

Read Also: Liquor Shops in AP: మద్యం షాపుల లాటరీకి వేళాయే.. దుకాణాలకు భారీగా దరఖాస్తులు

వైసీపీలో అధిష్టానం చెప్పిన పనులన్నీ చేసినప్పటికీ టిక్కెట్ తనకు కాదని గొల్లపల్లి సూర్యరావుకి టికెట్ కేటాయించారన్నారు. ఎంపీ టికెట్ నాకు ఇష్టం లేకపోయినా కొంతమంది పెద్దలు వచ్చి పోటీ చేయమని ఆదేశించారన్నారు. మరోసారి రాజోలు ఇంఛార్జి గొల్లపల్లి సూర్యరావు అని ప్రకటించారని చెప్పారు. వైసీపీలో కొనసాగనని, భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్తానో ఇంకా తాను చెప్పలేనన్నారు. వైసీపీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఏ పార్టీ నుంచి అయినా అవకాశం వస్తే ఆ పార్టీకి వెళ్తాను తప్ప వైసీపీ పార్టీలో అయితే జాయిన్ అవ్వనన్నారు.

 

Show comments