NTV Telugu Site icon

Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్కు నోటీసులు

Jeevan Reddy

Jeevan Reddy

Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. మాల్ వ్యాపారంలో అయోమయంలో ఉన్నారు. మరోవైపు.. మాల్ ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు.

Read Also: IB ACIO 2023: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 995 పోస్టులు.. పూర్తి వివరాలివే..

మరోవైపు.. జీవన్ రెడ్డి మాల్ కు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. విద్యుత్ శాఖకు రూ.2 కోట్ల బకాయి ఉండడంతో గతంలో నోటీసులు అందించారు. అయితే.. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

Show comments