మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 65. రుద్రమదేవి గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం నల్గొండ పట్టణంలోని రామగిరిలోని తన ఇంట్లో మృతి చెందింది. ఆమె 1985లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికై, 23 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలు. ఆమె భౌతికకాయాన్ని రామగిరిలోని ఆమె నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు.
Also Read : Vijay Setupathi: విక్రమ్ విలన్.. దేవుడా ఇలా మారిపోయాడేంటి..?
రుద్రమదేవి ఆకస్మిక మృతి పట్ల ఇంధన శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రుద్రమదేవి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఓదార్చారు. అంతేకాకుండా.. రుద్రమదేవి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా 1985లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్టీ రామారావు రాజీనామా అనంతరం రుద్రమదేవి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
Also Read : Son Chops Up Father: శ్రద్ధా కేసును తలపించేలా.. తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసిన కొడుకు