NTV Telugu Site icon

Former Miss World: టాలీవుడ్‌లోకి ప్రపంచ సుందరి!

Manushi Chillar

Manushi Chillar

Former Miss World Tollywood Entry: మిస్ ఇండియా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోతో ఆమె జోడి కట్టబోతున్నట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌తో ఆమె జట్టు కట్టనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. వరుణ్‌ తేజ్‌ తదుపరి చిత్రం ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్‌లో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌కు జోడీగా మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ ఎంపికైనట్లు తెలుస్తోంది.

Minister Roja: బర్త్ డే వేళ శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా

ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుండగా.. ఇందులో జెట్ పైలెట్‌గా వ‌రుణ్‌తేజ్ క‌నిపించ‌బోతున్నట్లు తెలుస్తోంది. ‘పృథ్వీరాజ్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మానుషి.. వరుణ్‌తేజ్‌కి జోడీగా నటించేందుకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. ‘పృథ్వీరాజ్‌’ సినిమాలో రాణి సంయోగిత పాత్రలో మానుషి చిల్లర్‌ నటనకు ప్రశంసలు దక్కాయి. 2017లో మిస్ ఇండియాతో పాటు మిస్ వ‌ర‌ల్ట్ టైటిల్స్‌ను మానుషి చిల్లార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Show comments