NTV Telugu Site icon

Srinivas Goud : హైడ్రా బాధితులకు భరోసా.. భద్రత కల్పించాలి..

Srinivas Goud

Srinivas Goud

హైడ్రా విషయంలో పేదలకు భరోసా, భద్రత ఇస్తే సమస్య ఉండదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల విషయంలో పునరావాసం కల్పించాలని, కూల్చివేతలు తప్పు అనడం లేదన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. అందరి పట్ల హైడ్రా సమానంగా వ్యవహరించాలని, అధికారులు తొందర పడొద్దన్నారు. వచ్చేది మా ప్రభుత్వమని, ఏ ప్రభుత్వం భవనాలకు అనుమతి ఇచ్చిన తప్పే అని ఆయన అన్నారు. మాపై కోపం పేదలపై చూపొద్దని, పేదలకు భరోసా కల్పించాలన్నారు. ప్రజలు వ్యతిరేకం అయితే అనుకున్న ఆశయం లక్షలు ఎలా నెరవేరతాయని, అర్బన్ లో ఉండే చెరువుల్లో ఉండేది డ్రెయిన్ వాటర్ అని, నిజంగా చెరువుకు హాని కలిగితే కూల్చివేతలపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు. చెరువులు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో కూడా ఆలోచించాలన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌. మహబూబ్ నగర్ నగరంలో ఉన్న చెరువులు పంటకు తాగునీటికి వాడటం లేదని, అక్రమ నిర్మాణాలకు అన్ని ప్రభుత్వాలది బాధ్యత అని ఆయన అన్నారు. అధికారులు తొందర పడొద్దని, పరిహారం అదింకగా ఇచ్చయినా పేదలకు ఇల్లు కోల్పోతున్న వారికి సాయం చేయండన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌.

అంతేకాకుండా..’గొడవలు లేకుండా 10 ఏళ్లుగా తెలంగాణ ను పరిపాలించాం. హైదరాబాద్ ను ఎవరు ఉహించనంతగా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న 33 పార్టీలను ఒప్పించి అందరి సహకారం తో రాష్ట్రాన్ని సాధించాం. 10 ఏళ్ళు పూర్తయినా విభజన హామీలు అమలుకావడం లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఇచ్చిన హామీ నెరవేర్చాలి. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇంకెంత కాలం తెలంగాణ నలిగిపోవాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు జరగలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తికాలేదు. బిబి నగర్ ఎయిమ్స్ నామమాత్రంగా ఉంది. అందరూ ఐక్యంగా ఒత్తిడి తెస్తేనే విభజన హామీలు అమలవుతాయి. ఖమ్మంలో 7 మండలాలు ఆంధ్రలో కలిపారు.. భద్రాచలం లో డంపింగ్ యార్డ్ పెట్టడానికి స్థలం లేదు. 7 గ్రామలిస్తే డంపింగ్ యార్డ్ పార్కింగ్ లాట్ పెట్టె అవకాశం ఉంటుంది. భద్రాచలం ఆలయం ఎలా అభివృద్ధి చెందుతుంది.. 7 మండలాలు,7 గ్రామాల వారు తెలంగాణ లో ఉంటామంటున్నారు..

Air India flight: ఆమ్లెట్‌లో బొద్దింక ప్రత్యక్షం.. ప్రయాణికుడికి అస్వస్థత

హిందూత్వం గురించి చెప్పుకునే బిజెపి 7 మండలాలను తెలంగాణ లోకలపాలి. షెడ్యూల్ 9,10 అంశాలు ఆస్తుల పంపకాలు పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇస్తుంది. రుణమాఫీకాలేదు. రైతు బంధు తో రైతులకు ఆసరా ఉండేది. భారత దేశంలో అత్యధిక పంట పండించిన రాష్ట్రం తెలంగాణ. విభజన హామీల పై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాలి. అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తెచ్చి విభజన హామీలు అమలయ్యేలా చూడాలి. విభజన హామీలు అమలు,కాంగ్రెస్ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలి. రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే విభజన హామీలు అమలు కావాలి. పార్లమెంట్ సభ్యులు విభజన హామీలపై దృష్టి పెట్టాలి. కేసీఆర్ కాలు బయటపెడితే ప్రళయం వస్తుంది. సమయం సందర్భం బట్టి కేసీఆర్ బయటకు వస్తారు. కేసీఆర్ ఖాళీగా లేరు.. కేసీఆర్ ఒక ప్రళయం.. కేసీఆర్ మౌనానికి ఒక అర్ధం ఉంటుంది.. ఇద్దరు ఎంపిలను గెలిపిస్తే రాష్ట్రాన్ని తెచ్చిన ఘనత కిసీఆర్ ది.. ఏపీకి ఎం కావాలంటే అది సాధించే స్థాయిలో చంద్రబాబు ఉన్నారు.. తెలంగాణ లో 9-10 స్థానాలు బీఆర్ఎస్ గెలిచి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేది.. ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు ..మోసపోయారు.. గతంలో బీఆర్ఎస్ అధికారం లో ఉన్నపుడు రాష్ట్రానికి కావాల్సినవి సాధించాం. పార్లమెంట్ లో మాకు కొట్లాడే అవకాశం లేదు.. విభజన హామీల విషయంలో రాష్ట్ర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి’ అని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.

Relationship Tips: ఇలాంటి వాళ్లు చాలా డేంజర్.. అమ్మాయిలూ.. మీ లవర్‌లో ఈ లక్షణాలు ఉన్నాయా?