కృష్ణా గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారు. నాగార్జునసాగర్ , శ్రీశైలం లో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదు. ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు
తెలంగాణలో తాగునీరుకి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తాగునీరు కోసం వాడాల్సిన నీటిని సాగు కోసం తరలించుకు పోతున్నారు. కృష్ణా గోదావరి జలాల్లో వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించుకు పోతుంది. కృష్ణా, గోదావరి ల నీళ్లు ఏపీ తరలించుకు పోతుంది అని హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు ను విమర్శలు చేయడం మానేసి.. చంద్రబాబును కేంద్రాన్ని అడగండి. అవినీతి అని కాంగ్రెస్ మాట్లాడితే నవ్వు వస్తుంది. తెలంగాణకి అన్యాయం చేసింది కాంగ్రెస్ బీజేపీలే..” అని జగదీశ్‌రెడ్డి వాఖ్యానించారు.
READ MORE: Bird Flu: 95 గ్రామాలలో నాటుకోళ్లకు బర్డ్ ఫ్లూ.. లబోదిబోమంటున్న పెంపకం దారులు!
ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు పఖర్చు పెట్టిన ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కూలిపోయిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయన్నారు. కాళేశ్వరం కూలిపోయింది. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తి వైఫల్యం చెందారని ఆయన మండిపడ్డారు. కృష్ణా వాటర్ లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కు వివరించా అని, పదేండ్ల పాటు అధికారం లో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారన్నారు. ఏపీ జల దోపిడీ కి సహకరించారని, పదేండ్ల పాటు తెలంగాణ కు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. పాలమూరు రంగా రెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్ల ను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.