NTV Telugu Site icon

KS Jawahar: న్యాయం గెలిచింది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Ks Jawahar

Ks Jawahar

అమరావతి: న్యాయం జరగడంలో ఆలస్యమవ్వొచ్చేమో గానీ న్యాయం మాత్రం గెలుస్తుందని మాజీ మంత్రి కేఎస్‌ జవహార్‌ అన్నారు. 1996లో జరిగిన శిరోముండనం కేసులో మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష పడటంపై ఆయన స్పందించారు. తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలన్నారు. లేదంటే దళితుల అణచివేతకు జగన్ లైసెన్స్ ఇచ్చినట్లే అని విమర్శించారు.

Read Also: Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రాష్ట్ర బడ్జెట్ సరిపోదు..

రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ రచనలు, అంబేడ్కర్ ఆలోచనలతో నేడు దళితులకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. 1996లో ఐదుగురు దళితులకు శిరోముండనం చేసి అవమానించారని గుర్తు చేశారు. తుర్కిలో, నెల్లూరులో లిడ్ క్యాప్, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఇండ్ల స్థలాలు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. తోట త్రిమూర్తుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలన్నారు. దళితులపై చిత్తశుద్ధి ఉంటే వారిపై దాడులు చేసినవారిని శిక్షించాలన్నారు.

Read Also: Thota Trimurthulu on Shiromundanam Case: నాకు అన్యాయం జరిగింది.. హైకోర్టుకు వెళ్తా..