నిర్మల్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల అభిప్రాయలను తెలుసుకున్నారు. ఏఎన్ రెడ్డి కాలనీలో క్లబ్ హౌజ్ లో కార్యకర్తల సమావేశం అయ్యారు. ఇక, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని మెజార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే నిర్మల్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారీ, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ హస్తం గూటికి చేరుకున్నారు. మొన్నీ మధ్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప జాయిన్ అయ్యారు.
Read Also: AP Election Campaign: ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అగ్రనాయకులు..
అయితే, వారి కంటే ముందే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండే అవకాశం ఉంది. కానీ, మాజీ మంత్రిని వద్దని కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఆందోళనలు చేశారు. ఈ ఆందోళనలతో మాజీ మంత్రి చేరిక ఆగిపోయింది. కాగా, కాంగ్రెస్ లో చేరే రోజే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక చేరిక ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇవాళ ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ సన్నాహాక సమావేశానికి ఇంద్రకరణ్ డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ఇంద్రకరణ్ రెడ్డిని ఉద్దేశించ పరోక్షంగా వ్యాఖ్యనించినట్లు సమాచారం.