Harish Rao Father Death: బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు ఫోన్ చేసి పరామర్శించారు కేసీఆర్.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
READ MORE: Delhi: వామ్మో.. ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టిన ప్రియురాలు..
మరోవైపు.. సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హరీష్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
READ MORE: Rohith Sharma: ఆస్ట్రేలియా సిరీస్‌లో విజయవంతమవడానికి కారణం అదే!
