NTV Telugu Site icon

Anil Kumar Yadav: ఇక నుంచి చూడండి ఎలా ఉంటుందో.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Anil Kumar Yadav

Anil Kumar Yadav

Anil Kumar Yadav: ఇప్పటిదాకా చేయాల్సింది చేశారు.. ఇక నుంచి చూడండి ఎలా ఉంటుందో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్.. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది.. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. నా పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. జగనన్న తోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు. 2009 తర్వాత నాతో ప్రయాణం చేసినవారు ఉన్నారు.. కొందరు విడిపోయారు. కొందరు పోతున్నపుడు తెలుసుకోవాలని చాలామంది చెప్పారు.. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి దూరమయ్యా.. మంత్రి పదవి పోయిన తర్వాత బాగా తిరుగుతున్నానని తెలిపారు..

ఎందుకు అనిల్ నెమ్మదిగా ఉన్నాడని కొందరు అంటున్నారు.. కొందరు నన్ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారు.. ఇప్పటిదాకా చేయాల్సింది చేశారు.. ఇక నుంచి చూడండి.. ఎలా ఉంటుందో అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్‌ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్‌.. 2009 లో ఎమ్మెల్యే నేను అవుతానని చెబితే చాలా మంది నవ్వారు.. కానీ, జగనన్న సాక్షిగా ఎమ్మెల్యే, మంత్రిని అయ్యాను.. జగనన్న చెబితే ఏమైనా చేస్తా.. ఆయన్ని జన్మలో మోసం చేయలేదన్నారు.. నా సొంత డబ్బులతో కార్యకర్తలకు సాయం చేశాను. కొందరు నన్ను సాయం అడిగితే వీలైనంత చేశాను.. మంత్రిగా ఉన్నపుడు అనిల్ బాగా సంపాదించాడన్నారు అని ఆరోపించారు.. కానీ, ఏమీ లేదన్నారు.. నాకు నచ్చక పోతే మొహం మీదే చెబుతా.. నన్ను వ్యతిరేకించిన వాళ్లకు ఆ విషయం తెలుసన్నారు.. అనిల్ ఎక్కడ పోటీ చేసినా ఒడిస్తాం అని అంటారు.. జగనన్నకే చేస్తామని బయటకి చెబుతారు.. ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే నా ఎదుట మాట్లాడాలి అంటూ మండిపడ్డారు.

చనిపోయిన నా తండ్రి సాక్షిగా చెబుతున్నా.. అయ్యప్ప మాల వేస్తా.. ఎవరినీ మోసం చేయలేదన్నారు అనిల్‌ కుమార్.. ఒక వ్యక్తి నా మీద మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను ఎవరినీ బెదిరించలేదన్న ఆయన.. ఎన్నికల్లో నాకు చాలా మందు సాయం చేశారు. ఎంతో కష్ట పడ్డారని తెలిపారు.. సమావేశంలో ఆర్యవైష్యులు ఉన్నారు.. నాలుగేళ్లలో ఎవరినైనా ఏమైనా అడిగానా..? అని ప్రశ్నించారు. డిప్యూటీ మేయర్ ఇస్తానని ద్వారకాకు మాట ఇచ్చా. ఎంతో ఒత్తిడి వచ్చింది. అయినా మాట తప్పలేదన్నారు. ద్వారకా కోసం సీఎం వైఎస్‌ జగన్‌ను ఎమ్మెల్సీ అడిగా.. కార్పొరేషన్ చైర్మన్ పదవి.. నుడా చైర్మన్ పదవి అడిగా.. గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవి కూడా అడిగా.. అది పెద్ద ప్రొటోకాల్‌ పోస్ట్‌.. చివరకు నుడా పదవి వచ్చిందని గుర్తు చేశారు. నేను ఏ పదవి ఇచ్చానని చెప్పను.. అన్నీ జగనన్నే ఇచ్చాడన్న ఆయన.. నేను మంత్రిగా ఉన్నపుడు ద్వారకా వెళ్ళలేదు. పదవి పోయిన రోజునే నన్ను వదిలి పెట్టాడు.. మనసులో ఏమీ పెట్టుకోవద్దని కూడా అడిగా.. ఇది తప్పని భావిస్తే శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు.. ఆయనకు ఏ ఏ పనులు చేశానో నా దగ్గర జాబితా ఉందన్నారు.. అనిల్ నాకు ఏమి చేయలేదని కొందరు నాయకులు చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌.