Site icon NTV Telugu

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

Nalini Met Revanth Reddy

Nalini Met Revanth Reddy

Former DSP Nalini met CM Revanth Reddy: మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు.

Read Also: Drugs Detection Test Kits: న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసుల సరికొత్త స్టెప్.. రంగంలోకి డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్

ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. తాను మళ్లీ డీఎస్పీ ఉద్యోగంలో చేరనని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంపై వైపే ఉంటానన్నారు. ప్రభుత్వానికి, మీడియాకు మాజీ డీఎస్పీ నళిని కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version