NTV Telugu Site icon

Team India: టీమిండియాకు మాజీ క్రికెటర్ వార్నింగ్.. వరల్డ్ కప్ కష్టమే..!

Kaif

Kaif

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టీమ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. మొహాలీలో ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇప్పటివరకు చాలా పేలవమైన ఫీల్డింగ్ చేసింది. కొన్ని సులభమైన క్యాచ్‌లను వదులుకోగా.. కొన్ని రనౌట్ అవకాశాలను కోల్పోయింది. దీంతో మహ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించాడు.

Read Also: MotoGP: ఇండియా మ్యాప్‌ని తప్పుగా చూపినందుకు MotoGP క్షమాపణలు..

ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ లో చాలా పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. ఫీల్డింగ్ ఒక్కటి ఆందోళన కలిగించే విధంగా ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా చేసిన తప్పులు మరోసారి బయటపడ్డాయి. ఇది చూసిన మహ్మద్ కైఫ్ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. తన టోన్‌లో ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. టీమ్ ఇండియా క్యాచ్‌లు పట్టకపోతే, ప్రపంచ కప్ జారిపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్ ద్వారా మ్యాచ్ గెలవవచ్చు, కానీ క్యాచింగ్ కూడా ముఖ్యమని పేర్కొన్నాడు.

Read Also: RK Roja: బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమేనా.. అసెంబ్లీలో చేతకాదా?

మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ డేవిడ్ వార్నర్ ఇచ్చిన సాధారణ క్యాచ్‌ను వదిలేశాడు. ఆ సమయంలో వార్నర్ 14 పరుగులతో ఉండగా.. ఆ తర్వాత 53 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మరోవైపు ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా కూడా చెత్త ఫీల్డింగ్ చేశారు. కెప్టెన్ రాహుల్ కూడా రెండుసార్లు రనౌట్ అయ్యే సులభమైన అవకాశాలను కోల్పోయాడు. ఇదిలా ఉంటే.. ఆసియాకప్ 2023 టోర్నీలోనూ ఫీల్డింగ్ చాలా పేలవంగా ఉంది. ఈ విషయమై పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్ బ్రిగేడ్‌ను హెచ్చరించారు.