టీమిండియా మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ భార్య పూనమ్ ఆజాద్ సెప్టెంబర్ 2న (సోమవారం) మరణించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు. 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు, ఆ జట్టులో కీర్తి ఆజాద్ కూడా భాగస్వామిగా ఉన్నారు. కీర్తి ఆజాద్ ఎక్స్‌లో ఇలా రాశారు.. ‘నా భార్య పూనమ్ ఇక లేరు. ఆమె మధ్యాహ్నం 12:40 గంటలకు స్వర్గస్తులయ్యారు.” అని రాసుకొచ్చారు. సెప్టెంబర్ 2వ తేదీన దుర్గాపూర్‌లోని దామోదర్ వ్యాలీ శ్మశాన వాటికలో పూనమ్ ఆజాద్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
READ MORE: AP Rains and Floods: వరద బాధితులకు ఆహార పంపిణీ.. రంగంలోకి దిగిన హెలికాఫ్టర్లు..
పూనమ్ ఆజాద్ కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. 2017లో కాంగ్రెస్‌లో చేరడానికి ముందు పూనమ్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు. కీర్తి ఆజాద్, పూనమ్‌లకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిపేర్లు సూర్యవర్ధన్, సౌమ్యవర్ధన్. వీరిద్దరూ జూనియర్ స్థాయిలో ఢిల్లీ తరపున క్రికెట్ ఆడారు.
READ MORE:Damodar Raja Narasimha: ప్రతి ఆసుపత్రిలో సెక్యూరిటీ హౌజ్‌ను ఏర్పాటు చేయాలి..
కీర్తి ఆజాద్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ బర్ధమాన్-దుర్గాపూర్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే వరల్డ్ కప్ గెలుపొందిన భారత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్.. ఆ తర్వాత ఆసియా కప్ తొలి సీజన్‌లోనూ చెలరేగాడు. కుడి చేతివాటం బ్యాటర్ అయిన ఆయన టీమిండియా తరఫున 7 టెస్టులు, 25 వన్డేలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 135 పరుగులు, వన్డేల్లో 269 పరుగులతో రాణించాడు. భారత స్వాత్రంత్య పోరాటంలో పాల్గొన్న భగవత్ ఝా ఆజాద్ కుటుంబానికి చెందిన ఆజాద్ ఆ తర్వాత రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగాడు.