Ambati Rayudu Quits YSRCP: బ్రేకింగ్: వైసీపీకి అంబటి రాయుడు గుడ్‌బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rayudu Quits YSRCP: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ మధ్యే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.. అయితే, వైసీపీలో చేరకముందు నుంచే ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతూ వచ్చిన రాయుడు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.. జగన్ సర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తూ రాజకీయాల్లోకి వచ్చేందుకు బాటలు వేసుకోవడమే కాదు.. వైసీపీలో చేరనున్నట్టు ఇంట్ ఇచ్చారు.. దాని అనుగుణంగా సీఎం సమక్షంలో గత నెల 28వ తేదీన వైసీపీలో చేరిన ఆయన.. ఉన్నట్టుండి ఇప్పుడు వైసీపీ వీడుతున్నట్టు ప్రకటించారు.
Read Also: Supreme Court: సుప్రీం కోర్టులో మద్యం బాటిళ్లు.. షాకైన సీజేఐ
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
నేను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు అంబటి రాయుడు.. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా.. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను.. ధన్యవాదాలు అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు అంబటి రాయుడు.. అయితే, గుంటూరు పార్లమెంట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వచ్చారు అంబటి రాయుడు.. జగన్ సర్కార్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు కూడా చేశారు. జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తాను ఆకర్షితుడిని అయినట్టు కూడా చెప్పుకొచ్చారు.. ఈ నేపథ్యంలోనే గత నెల 28వ తేదీన సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, పట్టుపని పది రోజులు కూడా గడవకముందే మళ్లీ వైసీపీకి గుడ్‌బై చెబుతూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.. అయితే, దీనిపై అంబటి వర్గం నుంచి ఎలాంటి స్పందనలేదు.. గుంటూరు పార్లమెంట్ గానీ లేదా గుంటూరు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాకపోవడంతోనే అంబటి రాయుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో సాగుతోంది.
అంబటి రాయుడు తాజా ట్వీట్
This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time.
Thank You.
— ATR (@RayuduAmbati) January 6, 2024
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!